ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్ 7.50గంటలకు , ప్రేయర్ అనంతరం మూడో బెల్ 8గంటలకు మోగించాలన్నారు.
see also..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?
అనంతరం ఆరు పీరియడ్లు నిర్వహించి మధ్యాహ్నం 12.30గంటలకు తరగతులు ముగించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో అన్నిపాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న దృష్ట్యా 6 నుంచి 9తరగతుల వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని సూచించారు .