ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ పార్టీలోకి ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ రత్తయ్య చేరనున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని, అయితే వైసీపీ అధినేత,ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తాను పోటీ చేసేదీ లేనిదీ తెలుస్తుందన్నారు. ఆయన చిత్తూరు జిల్లాలోని మంగుంట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే రత్తయ్య రాకతో వైసీపీ బలం మరింత పెరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. వైస్ ఛాన్సలర్ నుండి పదవి విరమణ చేసిన అనంతరం ఆయన ఇప్పటి వరకూ ఏ పార్టీలో లేరు. తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్న రత్తయ్య ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీని ఎంచుకున్నారు.