అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలిపారు . గురువారం హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. తెలంగాణలో మహిళల అభివృద్దికి, సంక్షేమానికి వారి రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని అన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిoచడానికి “WE- HUB” ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
SEE ALSO :కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!
తెలంగాణ రాష్ట్రాన్ని మహిళలకు సురక్షితమైన ఉమెన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా ఉచితంగా ఆంగ్ల విద్యను అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఒక పూట పౌష్టిక ఆహారాన్ని అందిస్తు, దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. “షీ” టీమ్స్ ఏర్పాటు ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని అన్నారు.
SEE ALSO :అవును, అందుకు కారణం జగనే..!!
అనంతరం 17 రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు పురస్కారాలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్, రాష్ట్ర బి.సి. కమిషన్ అధ్యక్షులు బి.ఎస్. రాములు, తెలంగాణ మహిళా ఆర్థిక అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు గుండు సుధారాణి, వివిధ జిల్లాల జిల్లా పరిషత్ అధ్యక్షులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు