తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.
see also :గల్ఫ్ కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ గళం..స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ
70 ఏళ్ల నుంచి గత ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు.సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఇంగ్లిష్ విద్య అందిస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు. బీసీ విద్యార్థులను సంవత్సరానికి 300 మందిని విదేశీ చదువులకు పంపిస్తున్నామని వెల్లడించారు. చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం, గొర్రెల పంపిణీతో ఆయా వర్గాలు బాగుపడుతున్నాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ఎమ్మెల్యే సీట్లలో సగం గెలిస్తే గొప్పేనని మంత్రి తలసాని అన్నారు.
see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!