కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు.
విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారికి సాంకేతిక పరికరాలు, ఆటోమేటిక్ మెషిన్లను అందుబాటులోకి తేవడం ఎంతైనా అవసరమని వారు తెలిపారు.
ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా 80% సబ్సిడీ తో విశ్వకర్మల కోసం ఇటువంటి అధునాతన మెషీన్ లను త్వరలో అందజేసెల ప్రణాళికల రూపకల్పన జరుగుతోందని, అందులో భాగంగానే ఈ expo ను సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. ఎం.బి.సి కార్పొరేషన్ కి కేటాయించిన 1000 కోట్ల రూపాయల ఫైల్ పైన కూడా ముఖ్యమంత్రి కే.సి.ఆర్ నిన్ననే సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.