ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట స్థితిలోఉంది.ఇలాంటి తరుణంలో నలబై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న కనుమూరి బాపిరాజు వైసీపీలో చేరనున్నారు అని జిల్లా రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి.
See Also:ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం..ఇప్పట్లో కనుచూపు మేర ఆ పార్టీ బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేకపోవడంతో బాపిరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన అనుచవర్గం అంటున్నారు.అయితే గత నాలుగు ఏండ్లుగా రాజకీయాల్లో మౌనంగా ఉన్న ఆయన తనను నమ్ముకున్నారి ,క్యాడర్కు నిత్యం అందుబాటులో ఉంటూ తనపై ప్రజల్లో ఉన్న మద్దతునే అలాగే నిలబెట్టుకున్నారు.
See Also:బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ఏపీ ప్రజలకు ప్రముఖ సినీ నటుడు సలహా..!
అయితే ప్రస్తుతం విభజన చట్టంలో ఉన్న హామీలను తుంగలో తోక్కడమే కాకుండా ఏపీకి న్యాయ బద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,ఉక్కు పరిశ్రమలాంటివి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కడంతో వైసీపీ గత నాలుగు ఏండ్లుగా ప్రజల పక్షాన పోరాడుతూనే మరోవైపు విభజన చట్టంలోని హామీల అమలుపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న తీరుకు నచ్చి ..జగన్ నాయకత్వాన్ని బలపరచడానికి ..రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి తానూ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆయన అనుచవర్గం అంటున్నారు.అయితే జగన్ త్వరలో పాదయాత్రలో భాగంగా గుంటూరు
రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను పెట్టి పార్టీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టించారు బాపిరాజు..
See Also:బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!