టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం.
అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ ను ధరిస్తాడో తెలుసా..అయితే కారణం ఏది లేదు.అది ఏమిటంటే ఎంఎస్ ధోని టీం ఇండియాకు కీపర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.
అయితే ఈ తరుణంలో ఎంఎస్ ధోని తను ధరించిన హెల్మెట్ కానీ క్యాప్ కానీ కింద పెట్టాల్సి వస్తుంది.అలా పెట్టినప్పుడు నేషనల్ ఫ్లాగ్ నేలను తాకుతుంది.అయితే నియమ నిబంధనల ప్రకారం నేషనల్ ఫ్లాగ్ కు అవమానం కల్గే విధంగా ఎటువంటి పనులు చేయకూడదు.ఈ తరుణంలో హెల్మెట్ కింద పెట్టడం నేషనల్ ఫ్లాగ్ కు అవమానం కల్గించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ తప్పు చేయకూడదు అని ధోని తన హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండా ధరిస్తాడు ధోని ..