ఏపీ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం ప్రత్యేక హోదా.గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి పడి మరి ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలైన బీజేపీ ,టీడీపీ ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తాం..విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తాం..రైల్వే జోన్ తోపాటుగా ఉక్కు పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెగ ప్రచారం చేసుకున్నాయి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తామని చెప్పి దాన్ని దాటేసింది.
See Also:బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!
దీంతో గత నాలుగు ఏండ్లుగా అలుపు ఎరగని పోరాటం చేస్తున్న వైసీపీ ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా సమరానికి తెర తీశారు.అంతే కాకుండా ఏప్రిల్ ఆరో తారిఖు వరకు కేంద్రం దారిలోకి రాకపోతే అదే రోజు తమ ఎంపీ పదవులకు రాజీనామాలను సమర్పించి వస్తారు అని జగన్ ఇప్పటికే ప్రకటించారు.అయితే కేంద్రం ప్రత్యేక హోదాపై తెగేసి చెప్పడంతో ఏమి చేయలేక ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్న తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించారు.
See Also:వైసీపీలోకి 40ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!
ఈ రోజు శుక్రవారం అవి ఆమోదం కూడా పొందాయి.ఈ తరుణంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని అర్ధమైంది.ఇప్పటికే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించిన వైసీపీ నేతలు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలి.అందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తే తను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు.అయితే ఇప్పటికే వచ్చే నెలలో ఆరో తారీఖున రాజీనామా చేస్తామని వైసీపీ ప్రకటించడంతో త్వరలోనే జేసీ దివాకర్ రెడ్డ్తి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఖాయం అన్నమాట ..!
See Also:బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ఏపీ ప్రజలకు ప్రముఖ సినీ నటుడు సలహా..!