కువైట్‌లోని గల్ఫ్ కార్మికులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్న రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ లేఖకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. కువైట్ దేశం కల్పిస్తున్న క్షమాభిక్ష కారణంగా దేశం వీడుతున్న వారిని ఆదుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న, సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారికి కువైట్ సర్కారు క్షమాభిక్ష కల్పించింది. దీంతో పలువురు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే వారికి ఆర్థిక పరమైన, ఇతరత్రా సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ స్పందించి కేంద్ర విదేశాంగ శాఖకు గత ఫిబ్రవరి 6వ తేదీన లేఖ రాశారు. కార్మికులకు సహాయ కారిగా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
see also :అకౌంట్ లో రూ 50 ఉంటే చాలు..బ్యాంక్ ఖాతా దారులకు శుభవార్త..!
ఈ లేఖకు కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి మనీశ్ గుప్తా స్పందించారు. క్షమాభిక్షను ఉపయోగించుకునే వారికి అన్ని రకాల సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. టికెట్లు పొందేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం సహా ఇరత అవసరాలన్నింటిలోనూ సహాయం చేస్తున్నామని వివరించారు.
see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.