కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు వెలవెలబోతున్నాయని, కాంగ్రెస్ నేతల మాటలను జనం విశ్వసించడం లేదన్నారు. 24 గంటల విద్యుత్తు సరఫరా, రైతులకోసం, భవిష్యత్తు తరాలకోసం ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ భగీరథ, కాకతీయ, పించన్లు, కల్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ వంటి ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
SEE ALSO :ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని
నిజాయితీతో నిబద్దతతో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, గత నాలుగేళ్లలో ఇది నిరూపణ అయిందని కెప్టెన్ చెప్పారు 70 శాతం ఉన్న రైతులకు భరోసా ఇచ్చే విధంగా కేసీఆర్ పాలన ఉందని, అందుకే ఎకరానికి పసలుకు నాలుగువేల రూపాయలు ఇచ్చే పథకాన్ని సీ ఎం ప్రారంభించబోతున్నారని ఆనయ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల దుకాణాల ముందు క్యూలు కట్టే వారని, విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోయి రైతులు సబ్ స్టేషన్లను ముట్టడించే వారని కెప్టెన్ గుర్తు చేసారు. అసలు కాంగ్రెస్ లో సరైన నాయకత్వమే లేదని, కాంగ్రెస్ నాయకులు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇస్తున్నారని, ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. పట్టపగలు మహానగరంలో ప్రజలంతా చూస్తుండగా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను విమర్శించే అర్హత, నైతిక హక్కు లేదని, దొంగే “దొంగ దొంగ” అని అరచినట్టుగా ఉందని అన్నారు.
SEE ALSO :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!
నిద్రాహారాలు మాని ప్రజల సంక్షేమంకోసం నిజాయితీగా నిబద్దతతో పనిచేస్తున్న మంత్రులు హరీష్ రావులపై అర్థ రహిత వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని, రాబొయే ఎన్నికల్లో ప్రజలే వారికి గుణపాఠం చెప్తారని కెప్టెన్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని, టీఆరెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్మాణాలతో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అనేక కేసులు వేసారని కెప్టెన్ మండిపడ్డారు. దేశమంతా తెలంగాణా పాలన వైపు చూస్తోందని పేర్కొన్నారు. దేశన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ బీజేపీలు సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యాయనే సీ ఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని, మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలు విశ్వసించరని, నిరుద్యోగ భృతి, రుణమాఫీ అన్నవి ఎన్నికల గిమ్మిక్కులని అన్నారు. అధికారం వస్తుందని కాంగ్రెస్ నాయకులు పగటికలలు కంటున్నారని, ప్రజలెవరూ కాంగ్రెస్ ను, కాంగ్రెస్ నేతల మాటలను విశ్వసించడం లేదని అన్నారు. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో చెప్పుకునేందుకు ఏమీ లేదని, గ్రూపుల కుమ్ములాటలతో ఆపార్టీ సతమతమవుతున్నదని, అధికారంలోని రాలేమనే అక్కసుతో విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు. 2019 లోనూ రాష్ట్రంలో టీఆరెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్రంలో కేసీఆర్ నేత్రుత్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడడం ఖాయమని ఎంపీ కెప్టెన్ జొస్యం చెప్పారు.