కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పై వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు.ఇవాళ ఉదయం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని …రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తలొగ్గడం శుభపరిణామమేనని అన్నారు.అయితే ఇంకా ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నారో చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
see also :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్న జగన్.. రాజీనామాలు చేయాలనుకున్నప్పుడు ఢిల్లీ పెద్దలకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవడానికి మేము సిద్దంగా ఉన్నా౦..చంద్రబాబు సిద్దమా అని పేర్కొన్నారు.అవిశ్వాసం ఎప్పుడు పెట్టడానికైనా వైసీపీ సిద్ధమన్నారు.ఒకవేళ టీడీపీ పార్టీ అవిశ్వాసం పెట్టినా సరే.. తాము మద్దతిస్తామని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
see also:జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదన్నారు. నరంద్రమోడీ ప్రధాని మంత్రిగా అయిన తర్వాత కూడా ప్లానింగ్ కమిషన్ కొన్ని నెలలు ఉంది. అయినా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోలేదని జగన్ ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ ఏడు నెలలు ఉన్నా నీతి ఆయోగ్ వచ్చేంత వరకూ చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. అప్పట్లోనే కేంద్రంపై వత్తిడి తెచ్చి ఉంటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చి ఉండేదన్నారు.
see also :బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగిలిపోకుండా చిత్తశుద్ధితో న్యాయంగా, ధర్మంగా పోరాటం చేయాలన్నారు. 25 మంది ఎంపీలు ఒక తాటిమీద నిలబడితే.. కేంద్రం దిగి వస్తుందన్నారు. మార్చి 21వ తేదీ అవిశ్వాసం పెట్టడానికి డెడ్ లైన్ అనేది లేదని, చంద్రబాబు మద్దతిస్తానంటే ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టడానికి నేను రెడీ అని జగన్ చెప్పారు.