ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ గురువారం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత ద్వారానే మహిళలు నిజమైన ప్రగతిని సాధించగలరని, ఇందుకు వైసీపీ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.పార్టీ ప్రకటించిన నవరత్నాలతోపాటు ఇతర పథకాల్లో మహిళల ప్రగతి కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
see also.. ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..!
మహిళా దినోత్సవం మరచిపోయిన చంద్రబాబు..
మరోపక్క గురువారం బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా దినోత్సవాన్ని మర్చిపోయారు. ప్రత్యేకంగా మహిళా దినోత్సవంపై మాట్లాడాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరగా తన సీట్లో లేచిన ఆయన ఆ విషయం కాకుండా ఇతర విషయాలు మాట్లాడారు.విభజన అంశం నుంచి హోదా వరకు పలు కోణాల్లో మాట్లాడి ఇక సెలవు అంటూ కూర్చున్నారు. అయితే, పక్కనున్నవారు మహిళా దినోత్సవాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయగా ఏమిటీ అంటూ అడిగే ప్రయత్నం చేశారు. ఈలోగా స్పీకర్ మరోసారి ఉమెన్స్ డే అంటూ గుర్తు చేశారు. దాంతో వెంటనే లేచిన చంద్రబాబు.. ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మహిళలకు తన అభినందనలు, శుభాకాంక్షలు అన్నారు.