ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు.
see also :అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ
ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొన్నటి వరకు ప్రత్యేకప్యాకేజీ చాలన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదం ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి ప్రత్యేకహోదా కోసం పోరాడకుండా టీడీపీ ఎందుకు మౌనంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మళ్లీ చంద్రబాబు ప్రత్యేకహోదా నినాదం ఎత్తుకున్నారని మండిపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ఎప్పటి నుండో వైసీపీ నాయకలు పిలుపునిచ్చారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే ప్రత్యేకహోదా సాధించగలమని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కేంద్రం ఇచ్చితీరాల్సిందే లేకుంటే ఏపీలో ఒక్క రైలు కూడ నడవదు అని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేగాక మా ఏపిరి ఉన్నంతవరకు మేము ప్రత్యేక హోదా కోసం పోరాడతమని తెలిపారు.
see also :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్ల వివాహం..!!