ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పత్తికొండ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాంబాబుతో సహా మరో ఇద్దరిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇన్పటికే వీరిని అరెస్టు చేయాలని డోన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయణరెడ్డి హత్య కేసులో అరెస్టు చేయాలని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ కేఈ శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.
see also : బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
see also : టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్
see also : పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!
ఈ నేపథ్యంలో ఇవాళ కేఈ శ్యాంబాబు క్వాష్ ఇటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వాష్ పిటిషన్ తప్పులతడకగా ఉందని, కోర్టును మోసం చేయాలని చూస్తారా..? అంటూ న్యాయమూర్తి కేఈ శ్యాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ పిటిషన్‌కు సంబంధించి నారాయణరెడ్డి కుటుంబ సభ్యుల తరుపున పొన్నవోలు సుధాకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు.