తెలుగులో అగ్ర హీరోలందరి సరసన సినిమాలు చేసి టాప్ చైర్ ని ఎంజాయ్ చేసిన రకుల్ ఈ మధ్య బాగా స్లో అయిపోయింది. ఇటీవల రీలీజ్ అయిన ‘స్పైడర్’ సినిమా తర్వాత రకుల్ ప్రీత్‌సింగ్‌కు తెలుగులో కంటే హిందీ, తమిళ చిత్రాల్లోనే నటించే అవకాశం వస్తున్నట్లు సమచారం. అయితే తెలుగులో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ జాగర్తగా అడుగులు వేసింది.అటు నటనని ఇటు గ్లామర్ ని కావలసినంత వాడుతూ ఆడియన్స్ కి దగ్గరయింది రకుల్ ప్రీత్ .తన గ్లామర్ సీక్రెట్ ఫిట్నెస్ అంటూ హైదరాబాద్ లో జిమ్ కూడా పెట్టేసింది .మెగా ఫ్యామిలీ తో సర్రైనోడు, ధ్రువ ,బ్రూస్ లి సినిమాలో ఆక్ట్ చేసిన రకుల్ నెక్స్ట్ జెనెరేషన్ సాయి ధరమ్ తేజ్ తో విన్నెర్ సినిమా లో స్క్రీన్ పంచుకుంది . కానిఒక్క తాజా ఫోటో షూట్స్ లో పూర్తిగా సన్నబడిన రకుల్ ప్రీత్ సింగ్ ని చూసి ఫాన్స్ అంటున్న మాట ఇదే… మరి ఇంత బక్కచిక్కితే ఇక సినిమాలు కాదు నీకు అవకాశం ఇవ్వడం కష్టమే…అని కొందరు. మరి కొందరు సినిమా కోసం..లేక జిమ్ లో ఎక్కువగా కష్టపడుతున్నావ అని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
