మహిళల సాధికారత కోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూపొందించిన వీహబ్ మొదటిరోజే రికార్డు సృష్టించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా వీహభ్ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి హబ్‌ను మహిళల కోసం ఏర్పాటుచేసిన తెలంగాణతో తాము జట్టుకట్టడం సంతోషంగా ఉందని నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపినట్లు జయేశ్ రంజన్ వివరించారు.
see also :చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
see also :చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు..తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా..?
ప్రస్తుతం జూబ్లిహిల్స్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గల టీశాట్ కార్యాలయంలో వీహబ్ కొలువుదీరిందని ఆయన తెలిపారు. టీహబ్2 ఏర్పడిన అనంతరం అక్కడ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీహబ్‌లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. www.wehub.telangana.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగానే ఆరు ఒప్పందాలు ఆయా సంస్థల ప్రతినిధులు కుదర్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధమైన యూఎన్‌డీపీ, సీఐఐ- ఇండియా వుమెన్ నెటవర్క్, సేల్స్‌ఫోర్స్, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐడియా, పీడబ్లూ్యఎల్ ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో ఉన్నాయి.