తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం మంత్రిమట్లాడుతూ.. ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు.
SEE ALSO :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకెళుతోందని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి అన్నారు .ఏరో స్పేస్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులు రాష్ట్రంలో ఉన్నాయని… హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు . ఈ సదస్సులో అమెరికా, జపాన్, యూకే, రష్యా, సింగపూర్ సహా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.