సినీ నటుడు శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, సినీ నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్న తరుణంలో, వైఎస్ జగన్ మాత్రం ఏపీకి దక్కాల్సిన ఫలాల గురించి వెలుగెత్తి చాటారన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్‌పై కుట్రపూరితంగానే కేసులు పెట్టిందని, అసలు వైఎస్ జగన్ నేరస్థుడు కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్నారు.
see also : బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్ల వివాహం..!!
see also : చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!
గత నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా అంశం బతికుండడానికి కారణం వైఎస్ జగన్. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదా అంశం వదిలి ప్రత్యేక ప్యాకేజీ కి మొగ్గు చూపినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం తాను ఏర్పాటు చేసిన సమావేశాల్లో, పాదయాత్రలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్థావిస్తూనే ఉన్నారన్నారు.
see also : ఓటుకు నోటు కేసులో హైకోర్టు చంద్రబాబును నిర్దోషిగా ప్రకటించింది..!!
అలాగే, బుధవారం కేంద్ర అరుణ్‌జైట్లీ మీడియా సమావేం, చంద్రబాబు మీడియా సమావేశం గురించి మాట్లాడుతూ.. ఏపీని అడ్డగోలుగా విభజించి.. తిరుతి వెంకన్నస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట దాటవేయడాన్ని నటుడు శివాజీ తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని నినదించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, దాని పార్టనర్ పార్టీ టీడీపీకి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.