టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేశారు. కొంతమంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్లోనే గుర్తించినట్లు హాసిన్ జాహన్ తెలిపారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నన్ను వేధిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్ మెదలెట్టారు. చంపాడానికి కూడా ప్రయత్నించారు. ఈ విషయంలో షమీ, అతని కుటుంబ సభ్యులపై ఇదివరకే పోలీసులకు సమాచారమిచ్చాను. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.’ అని హాసిన జాహన్ పేర్కొన్నారు.