ఎన్నికలు సమీ పిస్తున్న వేల..కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్యఫ్రంట్ ఏర్పాటు జరుగుతున్న క్రమంలోభాగంగా సోనియాగాంధీ తాజాగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఈ నెల 13 న విందుకు ఆహ్వానించింది.ఈ మేరకు ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ నేపధ్యంలో ” సోనియాగాంధీ ఇచ్చేది విందుమాత్రమే కాదు.. . ప్రతిపక్షాల ఐక్యత, బల ప్రదర్శన వేదిక’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
see also :జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
ఈ భేటీకి మోదీ సర్కారుపై గుర్రుగా ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షం టీడీపీని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సహా అగ్రశ్రేణి ప్రతిపక్ష నేతలంతా ఈ భేటీకి హాజరయ్యేలా చూడాలని సోనియా నిర్దేశించినట్లు అయన వివరించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె ఒక్కసారిగా మళ్లీ నడుం బిగించి, ప్రతిపక్ష పార్టీలతో విందు భేటీ ఏర్పాటు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.