ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమకు బలం లేకపోయిన కానీ మూడో స్థానానికి అభ్యర్థిని నిలబెడుతుంది.అందుకు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది.అందులో భాగంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో సాలూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరతో ఒక ఫిరాయింపు మంత్రి ఫోన్లో సంభాషించి పార్టీ మారాలి.పార్టీ మారితే కోరుకున్నంత డబ్బులు ..పోర్టు బులియన్లు ఇప్పిస్తా అని హామీ ఇచ్చాడు అంట .
see also : జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ డెసిషన్ ..!
అంతే కాకుండా ఒక్కసారి రెండు సార్లు కాకుండా ఐదారు సార్లు వాయిస్ కాల్స్ చేయడమే కాకుండా వాట్సాప్ లో ఆడియో కాల్ కూడా చేశాడు అంట ఫిరాయింపు మంత్రి.అంతేకాకుండా మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన ఆయన ఇటివల తన కుమారుడ్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేసిన ప్రముఖుడైన మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పార్టీ మారాలని ..తమ పార్టీ తరపున బరిలోకి దిగే రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించాడు అంట..ఈ క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికార టీడీపీ నేతలకు దూరంగా ఉంచడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
see also :రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?
అందులో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విదేశాలకు పంపించాలని ..రాజ్యసభ పోలింగ్ జరగనున్న 23తేది నాడు తీసుకురావాలని.అంతకుముందు తమ పార్టీ తరపున నిలబడే అభ్యర్థికి ఓటింగ్ వేయాలని పార్టీ విప్ కూడా జారి చేయడానికి జగన్ ప్లాన్ వేస్తున్నారు అంట.దీంతో ఒకవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కాకుండా మరోవైపు విప్ జారి చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా మంచి ఇరకాటంలో పడేయడానికి జగన్ వేసిన ప్లాన్ నాభూతో నా భవిష్యత్తు అన్నట్లు ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.చూడాలి మరి బాబు అధికార బలం ,ధన బలం ,మీడియా బలం ముందు జగన్ వేసిన ప్లాన్ ఎంతవరకు విజయవంతమవుతుందో ..!