వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ ను దాఖలుచేశారు.
see also :టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!
see also : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చాల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..జగన్ తనకు అత్యంత గౌరవం ఇచ్చారన్నారు.గత 4౦ ఏళ్లుగా తనకు వై ఎస్ కుటుంబంతో మంచి సంబంధం ఉందన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి తాను అభిమానిని అని, వైఎస్‌ఆర్ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి వెంట వైసీపీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నారు.
see also :సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!