Home / TELANGANA / జూన్ నెలాఖరుకు విశ్వవిద్యాలయాల్లో కొత్త అధ్యాపకులు..కడియం

జూన్ నెలాఖరుకు విశ్వవిద్యాలయాల్లో కొత్త అధ్యాపకులు..కడియం

యూనివర్శిటీలలో మెరుగైన విద్యనందించే ఏకైక లక్ష్యంతో వాటిని పటిష్టం చేయాలని, అకాడమిక్ షెడ్యూల్ కచ్చితంగా పాటించాలని, పి.హెచ్.డి అడ్మిషన్లలో పారదర్శకత ఉండాలని, కొత్త అధ్యాపకుల నియామకం జూన్ నాటికి పూర్తి కావాలని, యూనివర్శిటీల్లోవసతుల కల్పన కోసం ఇచ్చిన 420 కోట్ల రూపాయలను డెడ్ లైన్ లోపు ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విశ్వవిద్యాలయాల వీసీలను కోరారు. విశ్వవిద్యాలయాల వీసీలతో గవర్నర్ నరసింహ్మన్ ఆధ్వర్యంలో పది అంశాల ఎజెండాతో జరిగిన సమావేశంలో వాటి పురోగతి, అమలుపై నేడు నాంపల్లిలోని రూసా బిల్డింగ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 14 యూనివర్శిటీల వీసీలు హాజరయ్యారు. గవర్నర్ సమక్షంలో జరిగిన సమావేశంలోని అంశాలను అమలు చేయడంలో వీసీల తీరుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. త్వరలో గవర్నర్ నరసింహ్మన్ గారు సమావేశం నిర్వహించబోతున్నారు…అప్పటి వరకు గత సమావేశంలోని పది అంశాలపై ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నారు.

వీసీల సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ….ఈరోజు వీసీల కన్ఫరెన్స్ లో 14 యూనివర్సిటీ ల వీసీలు, ప్రతినిధులు వచ్చారన్నారు. హెల్త్ యూనివర్సిటీ వాళ్లు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదన్నారు. యూనివర్శిటీల ఛాన్సలర్ గా గవర్నర్ నరసింహ్మన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ లో 10 అంశాల ఎజెండాతో జరిగిన సమావేశంపై ఈ సమావేశంలో వీసీలు తీసుకున్న నిర్ణయాలపై పురోగతి గురించి వివరించారన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఇచ్చిన 420 కోట్ల రూపాయలలో చాలా యూనివర్సిటీ లు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేశామని వీసీలు చెప్పినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 వరకు అన్ని యూనివర్సిటీ లు ఈ ఏడాది విడుదల చేసిన నిధులకు సంబంధించి టెండర్లు పిలిచి, పనులు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. యూనివర్శిటీల్లో 1551 పోస్టుల భర్తీపై ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకని అడిగితే…కొన్ని పోస్టులను మార్చుకునేందుకు సమయం పట్టిందన్నారు. ఈ సమావేశంలో పోస్టులకు సంబంధించి మార్పులు చేసుకునేందుకు వీసీలకు అనుమతి ఇచ్చామని, వెంటనే ఈ మార్పు మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ తయారు చేసుకుని జూన్ చివరి నాటికి కొత్త అధ్యాపకులు యూనివర్శిటీలలో ఉంటారని వీసీలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మనకు ఆరు సంప్రదాయ యూనివర్శిటీలు, 31 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ మార్పుల నేపథ్యంలో యూనివర్శిటీల పరిధిలను కూడా మార్చాలని వీసీలు సూచించారని, దీనిని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకుల హాజరు నమోదు చేసేందుకు సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు పెట్టాలన్నది ప్రభుత్వ విధానమన్నారు. దీనిని అందరూ ఈ జూన్ నాటికి యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీల్లో అమలు చేయాలన్నాను.
యూనివర్సిటీ లకు వందల ఎకరాల భూములున్నాయని, వాటిని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు డాక్యుమెంటేషన్ చేయాలని, ప్రహరీ గోడలు నిర్మించాలని వీసీలకు సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో హరితహారం పెద్ద ఎత్తున చేపట్టాలని, సోషల్ ఫారెస్ట్ ప్రోత్సహించాలన్నారు. పి.హెచ్.డి అడ్మిషన్లలో గందరగోళం లేకుండా చేసేందుకు పక్కా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి బాధ్యతలు అప్పగించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ధీసిస్ సమర్పించే వరకు టైమ్ షెడ్యూల్ నిబంధనలు రూపొందించాలన్నాం. పిహెచ్.డి ఐదేళ్లకు మించి చేయడానికి వీలు లేదని, ఐదేళ్లు మించితే ఆ అడ్మిషన్ టర్మినేట్ చేయాలని వీసీలందరూ సూచించారని చెప్పారు. దీనిని అమలు చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ లలో ఇంక్యుబేషన్n సెంటర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి యూనివర్శిటీల వీసీలను కోరారు. యూనివర్శిటీలలో ఇంటర్నెట్, వైఫై, లైబ్రరీ డిజిటలైజేషన్ చేయాలని చెప్పారు. తెలంగాణ విశ్వవిద్యాలయాలు దేశంలోని అన్ని యూనివర్సిటీ లకు పోటీ పడేలా నాణ్యత ప్రమాణాలు పెంచాలని సూచించినట్లు తెలిపారు. యూనివర్శిటీలలో మంజూరు చేసిన పోస్టుల భర్తీ ఏ సమయంలోగా పూర్తి చేస్తారో చెప్పాలని వీసీలను అడిగినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వీటి భర్తీపై టైమ్ షెడ్యూల్ అడిగామన్నారు. . ప్రైవేట్ యూనివర్సిటీ లపై ఏమి ఆలోచన లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మార్చి 8 మహిళా దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం రానుందన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, 14 యూనివర్శిటీల వీసీలు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat