తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటివల దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించి యావత్తు దేశ రాజకీయాలనే తెలంగాణ వైపు చూసేలా చేశారు.ఆ రోజు నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఖాయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
See Also:Breaking News-ఏపీ మంత్రి వర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా ..!
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తే ఎక్కడ బరిలోకి దిగుతారో కూడా ఆ వార్తల్లో చెప్పేస్తున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యేగా గజ్వేల్ నుండి ,ఎంపీగా నల్గొండ జిల్లా నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నా వార్తలపై ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఎంపీగా బరిలోకి దిగుతారని చెబుతున్న నల్గొండ జిల్లాకు చెందిన నేతలు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.
See Also:బాబుకు జగన్ మగాడి సవాలు-జగన్ సవాలును బాబు స్వీకరిస్తాడా ..!
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగుతారు అని జరుగుతున్నా ప్రచారం అంతా వట్టిదే అని అధికార పార్టీ నేతల టాక్ .ఎందుకంటే దేశ రాజకీయాలను మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నది నిజమే అయినప్పటికీ ఆయన ఎంపీగా ఎక్కడ నుండి బరిలోకి దిగుతారో ఇంతవరకు తమకే స్పష్టతనివ్వలేదు .అట్లాంటి సమయంలో మీడియాలో వచ్చిన వార్తలను ఎలా నమ్మాలని కూడా అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పేదాకా ఇలా పలు వార్తలు చక్కర్లు కొట్టడం ఖాయం అన్నమాట ..