70 ఏండ్ల సంది ఈ శనిగరం చెరువును పట్టించుకున్న పాపాన పోలే సారూ., ఇయ్యాల నువ్వొచ్చినవ్ సారూ అని నీళ్ల మంత్రి హరీశ్ రావుతో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు చెరువు సందర్శనలో ఆ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు వీరయ్య కాసేపు చర్చించారు. నువ్వు వచ్చుడు మొదలైన తర్వతే.. చెరువు మంచిగ అయితందని తనదైన శైలిలో వివరించారు.
– వచ్చే వాన కాలం నాటికి చెరువులు ఎండటం ఉండదు.
– రాష్ట్ర నీళ్ల మంత్రి హరీశ్ రావు.
వచ్చే వానకాలం నాటికి చెరువులు ఎండటం ఉండదని, ఇక్కడి ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తున్నామని అక్కడి స్థానికులు, ఈజీఎస్ కూలీ పనికి వెళ్తున్న మహిళలతో నీళ్ల మంత్రి హరీశ్ రావు కాసేపు వారితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అడిగి తెలుసుకుంటూ.. సర్కారు దవాఖానలు ఏలా ఉన్నాయని అడిగారు. ఈ మేరకు కడవ అనూష మస్తు మంచిగ అయినయ్ సారూ.! ఇంతకు ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దవాఖానల మంచి సౌలత్ ఉందని, మొన్న మా ఆడుబిడ్డ కాన్పు అయితే సర్కార్ దవాఖానకే పోయినం. పెద్దది కేసీఆర్ కిట్ ఐ ఇచ్చిండ్రు., అని చెప్పింది. కేసీఆర్ కిట్ ఏట్లుందని మంత్రి ఆరా తీయగా ఆ.. కిట్ పెట్టె మస్తు పెద్దగనే ఉందని.. చిన్న పిల్లలకు ఇచ్చే అన్ని మాకు మంచిగ పనికొస్తున్నాయని మంత్రికి వివరించింది.
– తగిన వేతనం ఉండాలని మంత్రిని కోరిన ఈజీఎస్ కూలీలు
మా చేతులు పొక్కులు వస్తున్నాయి.. సారూ.! మాకు తగిన వేతనం ఉండేలా ఏదైనా పరిష్కారం చేయండి సారూ.. అని ఉపాధి హామీ పనికి వెళ్ళే మహిళా కూలీలు మంత్రి హరీశ్ రావుకు తమ సమస్యలు విన్నవించారు. ఈ విషయంపై ఎంపీ వినోద్ స్పందిస్తూ రేపు జరిగే పార్లమెంటు సభలో ఈజీఎస్ అంశాలపై చర్చ జరుపుతామని వివరించారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. మా దగ్గర కోల్డ్ స్టోరేజీ ఉన్నదని., అక్కడ పని చేయడానికి 200 మంది మీరు వస్తరా అమ్మా. మరీ మీరు వస్తారంటే.. నేను మాట్లాడుతానని.. రోజు రావాలని వారికి సూచించారు. వస్తాం సారూ.. అంటూ మంత్రికి మాట ఇచ్చారు.
Post Views: 200