టాలీవుడ్ స్టార్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున సరస బంగారు బుల్లోడు,ఆకాశ వీధిలో లాంటి సినిమాల్లో నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి రవీనా టాండన్ పై ఓడిశా రాష్ట్రంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో గత ఆదివారం రాష్ట్రంలో శ్రీలింగరాజు ఆలయం దగ్గర హీరోయిన్ రవీనా టాండన్ ఒక ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు.
అయితే ఆ ఆలయ నియమ నిబంధనల ప్రకారం కెమరా కానీ సెల్ ఫోన్స్ కానీ అనుమతి లేదు.అయితే నో కెమరా జోన్ దగ్గర ఒక ప్రముఖ కంపెనికి చెందిన ప్రకటనలో చిట్కాలు వివరిస్తున్నట్లు ఆ షూట్ జరిగింది.ఈ షూటింగ్ జరుగుతున్నంత సేపు ఒక వ్యక్తీ తను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అంతే అది వైరల్ అవ్వడంతో ఆలయ నియమ నిబంధనలను తుంగలో తొక్కి ..భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉండటంతో ఆలయ సిబ్బంది పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.