తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపెట్ మండలంలోని ధర్మారావు పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో జరిగిన వార్షికోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల విద్యార్థుల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు.
అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోడల్ స్కూళ్లను, సాంఘీక సంక్షేమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించిదని తెలిపారు …గురుకుల, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చుచేస్తుందని, వారికి నాణ్యమైన విద్యా, భోజన, ఇతర వసతులు కల్పిస్తోందని, ప్రతి పేద విద్యార్థి ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, బాగా చదువుకుని, జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని సూచించారు …
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడగగానే స్కూల్లో బోర్ వెల్ వేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలకి అదనపు తరగతి గదులు, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని కోరగా కలెక్టర్ గారితో మాట్లాడి అతిత్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు …దీనితో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమంలో కాసిపెట్ మండలఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.