గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ప్రయోజనాలతోపాటు హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాల దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు మాట్లాడారు .అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. GST రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఆశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు. ఏపీకికూడా ప్రత్యేక పరిస్థితుల్లో 90:10 నిస్పత్తిలో నిధులు అందించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే విధానమే మనుగడలో లేకుండా పోయిందని జైట్లీ చెప్పారు .
