ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుక వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అద్దంకి నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. సోమవారం నాగులపాడు గ్రామంలో ప్రవేశించే సరికి పాదయాత్ర 1400 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సీసీ రహదారిపై రంగులు కలిపిన ఉప్పుతో అక్షరాలను రాసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దీనికి గుర్తుగా జగన్ అక్కడో రావి మొక్కను నాటి జెండాను ఆవిష్కరించారు.
see also..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత..! డేట్ ఫిక్స్..!!
ఆ గ్రామంలోని మహిళలు, యువతులు జగన్‌ను కలిసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డా రు. చిన్నారులను జగన్ ఎత్తుకుని ముద్దాడారు. పూలను దారి పొడవునా చల్లి, రహదారులను పూలబాటలుగా చేశారు. వృద్ధులు, నడి వయసు మహిళలు జగన్‌ను కలిసి అయ్యా ఇంత కష్టపడి జనం సమస్యలు తెలుసుకుంటున్నావు. నువ్వే సీఎం అవుతావంటూ దీవించారు.
కొంతమంది చెల్లెమ్మలు జగన్‌కు రాఖీ కట్టి, అన్నయ్యా.. అంటూ అనుబంధం కలుపుకున్నారు. అంతేగాక ‘మా ఊరుకు బస్సు సౌకర్యం లేదు. విద్యార్థినులు విద్యాలయాలకు సకాలంలో చేరుకోలేక చదువులు మానేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇప్పుడు ఆర్టీసీ బస్సు వేశారు. ఎన్ని రోజులు నడుపుతారో కూడా తెలియదు. ఈ బస్సు సర్వీసు కూడా ఉదయం 10 గంటలకు వేయడంతో మాకు ప్రయోజనం లేదు. 9 గంటలకు మార్చేలా చూడాలి’ అంటూ నాగులపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని గొర్రెపాటి మాధవి పాదయాత్రలో వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
see also..భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసింది..కాని కొడుకును ఎందుకు హత్య చేశారంటే..