నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు పడుతున్నాడు.ఈ నేపథ్యంలో టీం ఇండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ నీరవ్ మోదీ దెబ్బకు ఏమి చేయాలో అర్ధం కాక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఎప్పటి నుండో విరాట్ పంజాబ్ నేషనల్ బ్యాంకు కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెల్సిందే.దీంతో నీరవ్ మోదీ కుంభ కోణం నేపథ్యంలో తన ఒప్పందానికి విరాట్ ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆయన ప్రతినిధి తెలిపారు ..
