తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 30 పడకలను 50 పడకలకు పెంచుతూ నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో ఏడెనిమిది మంది స్పీకర్లను చూసాం కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని చేసే నాయకులు మధుసూదనాచారి అని పేర్కొన్నారు .
see also :హరీష్ బాల్కొండకొస్తే చంపేస్తాం-తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ..
ప్రతి ఊరు, మండలంలో రాత్రిళ్ళు పడుకొని వసతులు ఏమి లేవో తెలుసుకొని, మా మీద ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తున్నారాణి చెప్పారు . ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి ప్రత్యేక నిధులు తెస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుని వలే పని చేస్తున్నారు అని కొనియాడారు . రూ.18 కోట్లతో వంతెన నిర్మాణం, రూ.45 కోట్లతో రోడ్ వెడల్పు కార్యక్రమాలు చేపడుతున్నాం. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ని చూసామ్..కానీ మూడున్నరేళ్లలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఎప్పుడు జరగలేదు అని అన్నారు . ఇది దేశంలో కూడా జరగాలని సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయం కావాలంటున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి పునాదిగా సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారు… దీనికి మీరు పూర్తి మద్దతు ఇవ్వాలి అని కోరారు .
see also :రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!