ఏపీ అధికార టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం తన పొలిటికల్ కెరీర్ లో ఓటమి ఎరగని నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు.
కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకాని తనం వలన మొత్తం పొలిటికల్ కెరీర్ లో అన్ని అపజయాలనే చవిచూస్తున్నాడు.అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.తన అసమర్థ నాయకత్వం వలన ఆ పార్టీ బీటలు వారుతుంది.
ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభలో పాల్గొనకుండా జగన్ అతని పార్టీ ఎమ్మెల్యేలు చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .జగన్ కు పిచ్చి పట్టిందని ..అందుకే పాదయాత్ర అంటూ రోడ్లపై తిరుగుతున్నారు అని ఆయన విమర్శించారు.