కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు అయిన కార్తి చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కుంభ కోణం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు.
విచారణ పూర్తీ కాగానే ఈడీ అరెస్టు అవకాశాలున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కార్తి చిదంబరం తనను ఈడీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలసిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
అందులో భాగంగా ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో తనను అరెస్టు చేయకుండా ఉండాలని కోరిన పిటిషన్ ను కొట్టేస్తూ మధ్యంతర బెయిల్ ను నిరాకరించింది.అయితే ఈ క్రమంలో కార్తిపై నమోదైన ఎఫ్ఐఆర్ పత్రాలను ఆయనకు ఎందుకివ్వలేదని ఈడీ,సీబీఐలకు నోటీసులు జారీచేసింది..