దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . దేశంలోని మొత్తం జాతీయ మీడియా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చిస్తున్నాయి . ఇంగ్లిష్ , హిందీ , తెలుగు సహా అనేక ప్రాంతీయ బాషా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా తమ శైలిలో రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాయి . దేశంలోని మేధావులు , వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులతో ప్రధాన నగరాల్లో చర్చలు జరపనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంది .
see also :2019లో గెలుపు టీడీపీదే.. కన్ఫాం చేసిన జలీల్ ఖాన్..!!
పద్నాలుగేళ్ళు ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఎమ్మెల్యేగా , రాష్ట్ర , కేంద్ర మంత్రిగా , ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయవేదిక నిర్మాణంలో సక్సెస్ అవుతారన్న అభిప్రాయాన్ని చాలా వరకు జాతీయ మీడియా అభిప్రాయంలో వ్యక్తమవుతున్నది . తెలంగాణ కు ఏకాభిప్రాయాన్ని సాధించే క్రమంలో ఈ దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో కేసీఆర్ సంబంధాలు కొనసాగించారని , ఆ పరిచయాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణంలో కేసీఆర్ కు ఉపయోగపడతాయని జాతీయ మీడియా విశ్లేషిస్తున్నది . ఎమ్మెల్యే నుండి రాష్ట్ర , కేంద్ర మంత్రిగా , ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం కూడా కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను అద్భుతంగా రూపొందించడానికి ఉపకరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .
see also :ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్