మద్యం మత్తులో ఓ వృద్ధురాలి పై అత్యాచారం చేయడమే కాదు.. అనతరం ఆమెను హతమార్చాలని చూశాడు. తలపై బాది తీవ్ర గాయం చేశాడు.. ఈ ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకొన్నది. మధుబాన్ కాలనీలో 75 ఏళ్ల వృద్ధురాలు నివశిస్తుంది.. ఆ వృద్ధురాలికి కల్లు తాగే అలవాటు ఉంది.. ఈ నేపథ్యంలో ఫుల్ గా కల్లు తాగి ఇంట్లో ఒంటరి గా ఉన్న సమయంలో స్థానికంగా ఉండే వంశీ అనే 21 యువకుడు ఆ వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.
అనంతరం తన గురించి అందరికీ తెలుస్తుంది అని భయపడి.. ఆమెను చంపాలని భావించి.. గొడ్డలితో తలపై కొట్టి పరారయ్యాడు. బాధితురాలి కొడుకు రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి ఆసుపత్రికి తరలించాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వంశీ అని గుర్తించారు.. అదుపులోకి తీసుకొని విచారణ చేయగా… తానే ఆ వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. హత్యాయత్నం చేసినట్లు అంగీకరించాడు.. అంతేకాదు.. వయసుతో.. వరసతో పని ఏముంది… ఆడది ఐతే చాలు.. అత్యాచారం చేయడానికి… అనే నినాదంతో వంశీ గతంలో కూడా ఇటువంటి దారుణ ఘటనలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.