Home / SLIDER / కేసీఆర్ కిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది..మంత్రి లక్ష్మారెడ్డి

కేసీఆర్ కిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది..మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియ‌ర్ రెసిడెంట్స్ హాస్ట‌ల్‌, 30 ప‌డ‌క‌ల స‌ర్జిక‌ల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళండంలో భాగంగా విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్ కాలేజి వరకు ఏమేమి ఉండాలో వాటన్నిటినీ సమకూర్చి రూపురేఖలు మార్చుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని స్పెషాలిటీ ట్రీట్ మెంట్స్ అందిస్తున్నాం అని తెలిపారు . ప్రభుత్వ దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మంచి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాన్నాం అని చెప్పారు .

see also :2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

కేసీఆర్ కిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. 240 వాహనాలు గర్భిణీ మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రారంభించి నడిపిస్తున్నాం అని పేర్కొన్నారు . బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చే వరకు అన్ని రకాల వసతులు అందిస్తున్నాం. అదే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు . దాదాపు10 వేల పోస్టులు భర్తీ చేస్తూ స్టాఫ్ కొరత లేకుండా చేస్తున్నాం. ఫార్మ్ బి వారికి న్యాయం చేయడానికి కమిటీ వేశాం అన్నారు.ఈ కార్య‌క్ర‌మాల్లో జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గ‌ద్ద‌ల‌ ప‌ద్మ‌, మేయర్ నన్నపనేని నరేందర్,ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే దాస్యం విన‌య భాస్క‌ర్‌, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్‌, డి.ఎం.ఎచ్. ఓ హరీష్ రాజ్, హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ దొడ్డ ర‌మేశ్‌, ఇత‌ర‌ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

see also :భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసింది..కాని కొడుకును ఎందుకు హత్య చేశారంటే..

see also :ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం..కడియం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat