తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, 30 పడకల సర్జికల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా హాస్పిటల్లోని వసతులు, సర్జికల్ వార్డులోని సదుపాయాలను, డయాలసిస్ కేంద్రంలోని ఫిల్టర్లను ఉప ముఖ్యమంత్రి కడియం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పరిశీ లించారు.
ఈ సందర్భంగా మంత్రి కడియం మాట్లాడుతూ..రోగులకు మరింత మంచి వైద్య సదుపాయాలు కల్పించే వాటిని నేడు ప్రారంభించాం. రోజు 56 మందికి డయాలసిస్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు . భూపాలపల్లి ఏటూరునాగారం లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కు మంత్రి లక్ష్మారెడ్డి సహకారించాలన్నారు పి.ఎం.ఎస్.ఎస్.వై కింద కె.ఎం.సి ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో ప్రారంభం అయితే ఎం జి.ఎం పై భారం తగ్గుతుందన్నారు . మెరుగైన వైద్యం, మెరుగైన పరిశుభ్రత ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కల్పిస్తున్నాం. గతంలో లేని విధంగా ప్రభుత్వ దవాఖానాలు పటిష్టం అవుతున్నాయన్నారు.