ఈ నెల ( మార్చ్ ) 8 వ తేదీ న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిపురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు అవార్డులను ప్రకటించింది.రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ కమిటీ ఈ అవార్డు జాబితాను రూపొందించింది. ఈ అవార్డులకు ఎంపికైన 20 మంది మహిళలను మార్చి 8న 1 లక్ష నగదు రివార్డుతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.
see also :కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన
విద్యారంగం – కవిత దరియాణి
క్రీడలు – అరుణా రెడ్డి
వైద్యం – సత్యలక్ష్మి
పాత్రికేయం – సౌమ్య నాగపురి(నమస్తే తెలంగాణ), లతా జైన్
సాహిత్యం – చక్రవర్తుల లక్ష్మీనరసింహ, సిరి
నాట్యం – మంజులా శ్రీనివాస్
సంగీతం – నిత్య సంతోషిణి
see also :2019లో గెలుపు టీడీపీదే.. కన్ఫాం చేసిన జలీల్ ఖాన్..!!
చిత్రకళలు – కవితా దేవుష్కర్
సినీరంగం – నందినీ రెడ్డి
జానపద సాహిత్యం – ఝాన్సీ
ఉద్యమగానం – ఎడునూరి పద్మ
మహిళా వ్యాపారవేత్త – రాజ్యలక్ష్మి
వృత్తి సేవలు – మెట్రో రైలు మొదటి లోకో డ్రైవర్ సుప్రియ, ఢిల్లీలో ఆర్టీసీ డ్రైవర్ సరిత
మహిళా సాధికారత – యాప భద్రమ్మ
వ్యవసాయం – బొగ్గం జయమ్మ
ప్రజాప్రతినిధుల విభాగం – కొత్తపల్లి గ్రామసర్పంచ్ శైలజ
సామాజిక సేవ – గండ్ర రమాదేవి