దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . తాజాగా అక్రమ సంబంధం కారణంగా బాలుడిని అపహరించి హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీఆర్ నగర్ సమీపంలో నేసపాకం భారతి నగర్‌కు చెందిన కార్తికేయన్ కుమారుడు రితేశ్ సాయి (10) అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం హిందీ ట్యూషన్‌కి వెళ్లిన రితేష్‌సాయి రాత్రి 8.30 అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కార్తికేయన్ ఎంజీఆర్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భార్య మంజులకు సేలయూర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కార్తికేయన్ తెలిపాడు. తన కుమారుడిని అతడే కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు.
see also..2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్..? జనసేన..?
నాగరాజు మొబైల్‌ను ట్రేస్‌చేసిన పోలీసులు వేలూరులో ఉన్నట్లు గుర్తించి, గురువారం ఉదయం అరెస్టు చేసి విచారించారు. తంబారం-సేలయూర్ రోడ్డు సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవంతిలో తీవ్రగాయాలతో రితేశ్ సాయి విగతజీవిగా పడి ఉన్నాడు. సాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం క్రోమ్‌పేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీఎన్‌ఈబీలో ఉద్యోగినిగా విధులు నిర్వహించే మంజులకు నాగరాజుతో పరిచయం ఏర్పడి క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి సంబంధం గురించి భర్త కార్తికేయన్‌కు నాలుగు నెలల కిందట తెలియడంతో మందలించాడు. అయినా సరే వీళ్లు వినిపించుకోలేదు. దీనిపై జనవరిలో పోలీసులకు కార్తికేయన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును పిలిపించి హెచ్చరించారు. దీంతో అక్కసు పెంచుకున్న నిందితుడు రితేశ్ సాయిని అపహరించి హత్య చేశాడు.
see also..2019లో గెలుపు టీడీపీదే.. కన్ఫాం చేసిన జలీల్ ఖాన్..!!