తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఎక్కడ ఇక్కడ ఉంటె అరెస్టు చేస్తారేమో అని వదిలి అమరావతికి వెళ్లారు అని ఏపీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసే ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీను ఇరుకున పెట్టె ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
see also : రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!
ఈ నెల ఇరవై మూడో తేదిన రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితేఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో అరవై ఏడు మందిలో ఇరవై మూడు మంది టీడీపీలో చేరగా నలబై నాలుగు మందే ఉన్నారు.దీంతో వైసీపీ పార్టీకి ఎంపీ సీటు గెలవడం ఖాయం.ఈ నేపథ్యంలో తమకు బలం లేకపోయిన కానీ వైసీపీ ఎమ్మెల్యేలను నోట్లతో ,పోర్టు బులియన్లతో ఆకర్షించి రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.అందులో భాగంగా అధికార టీడీపీకి చెందిన మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలకు కాల్స్ చేసి మంతనాలను కొనసాగించారు.అందుకు తగ్గ ఆడియో వీడియో టేపులు తమ దగ్గర ఉన్నాయి వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో సాలూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరతో ఒక ఫిరాయింపు మంత్రి ఫోన్లో సంభాషించి పార్టీ మారాలి.పార్టీ మారితే కోరుకున్నంత డబ్బులు ..పోర్టు బులియన్లు ఇప్పిస్తా అని హామీ ఇచ్చాడు అంట .అంతే కాకుండా ఒక్కసారి రెండు సార్లు కాకుండా ఐదారు సార్లు వాయిస్ కాల్స్ చేయడమే కాకుండా వాట్సాప్ లో ఆడియో కాల్ కూడా చేశాడు అంట ఫిరాయింపు మంత్రి.
see also :హరీష్ బాల్కొండకొస్తే చంపేస్తాం-తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ..
అయితే తెలివిగా రాజన్నదొర ఈ సంభాషణను రికార్డు చేసి తమ పార్టీ ఎమ్మెల్యేలకు ,అధిష్టానానికి తెలియజేశాడు అంట .అంతేకాకుండా మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన ఆయన ఇటివల తన కుమారుడ్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేసిన ప్రముఖుడైన మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పార్టీ మారాలని ..తమ పార్టీ తరపున బరిలోకి దిగే రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించాడు అంట .దీంతో ఇరు ప్రాంతాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రులు భేరసాలు ఆడిన ఆడియో వీడియో టేపులను తమ అధిష్టానానికి అప్పజెప్పారు అంట .సో ఎన్నికల రోజు అంటే ఈ నెల 23తేదిన ఆ ఆడియో వీడియో టేపులను ఎన్నికల కమిషన్ సాక్షిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో బయటపెట్టాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.చూడాలి మరి తెలంగాణ ఓటుకు నోటు కేసుతో తెలంగాణను వదిలిపెట్టిన బాబు ఇప్పుడు ఏపీ ఓటుకు నోటుకేసు వ్యవహారంతో ఎక్కడ దాక పోతాడో మరి ..