రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.ఇవాళ మూసీనది ప్రక్షాళన కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు.
see also :సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల
రాష్ట్ర సచివాలయం నుంచి పాలన చేయని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా, బీజేపీ విజయం సాధిస్తుందని..ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని.. ఈ క్రమంలోనే ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
see also :రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!