మాజీ మంత్రి,గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టిడిపి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో దళితులకు గౌరవం లేదని ఆయన వ్యాఖ్యానించారు.పేరుకు దళితులు ప్రజాప్రతినిదులని, పెత్తనం అంతా ఒక కులంవారిదేనని ఆయన అన్నారు. ఇది తన ఒక్కరి నియోజకవర్గంలోనే కాదని,మిగిలినవారి పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు.
see also..భార్యను తండ్రి అత్యాచారం చేస్తుండగా చూశానని భర్త..చివరకు ఏం చేశారు
వేమూరు నియోజకవర్గానికి మంత్రి ఆనంద బాబు ప్రాంతినిద్యం వహిస్తున్నా పెత్తనం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజాదేనని, కొవ్వూరులో మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా,అక్కడ పెత్తనం సుబ్బరాజు చౌదరిదేనని ఆయన అన్నారు.గోపాలపురం రిజర్వుడ్ నియోజకవర్గంలో పెత్తనం ముళ్లపూడి బాపిరాజుదని, కొడుమూరులో మణిగాందీ నామమాత్రపు ఎమ్మెల్యే అని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో పెత్తనం జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ ది అని ఆయన అన్నారు.దళితుల ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయన చెప్పా. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది. నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తేలింది..’’ అని రావెల పేర్కొన్నారు. అయితే ఈ వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పార్టీ మారుతాడ అనే చర్చ జరుగుతుంది.
see also..అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు