ఏపీలో ఎప్పుడు ఎదో ఒక గొడవతో బయటపడే పేర్లు..జేసీ బ్రదర్స్ . అదికార అండతో వీరు చేసే ప్రతిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై అనంతపురం ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కొండసాని సురేష్ రెడ్డి చాలాకాలం పాటు అధికారికంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పీఏగా పనిచేశారు. ఇప్పుడు అనధికారికంగా జేసీకి సేవలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓ పేరు మోసిన క్రికెట్ బుకీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కొండసాని సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
see also..అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు
అంతేకాదు పంచాయతీ రాజ్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తూ ఇటీవల సురేష్ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి పేరుతో భూబ్జాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సురేశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు జేసీ ద్వారా సురేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు.