రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్‌షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్ధికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 వేల కోట్లలో చంద్రబాబు వాటా ఎంత..? బీజేపీ నేతల వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉందంటూ సినీ నటుడు శివాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also : సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. పవన్ కళ్యాణ్
see also : పవన్‌కు షాక్ ఇచ్చిన జగన్..!
ఆ రోజునే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం లక్షల కోట్లు కేటాయించిందని చెప్తే.. ఆ వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ మీరు కేటాయించిన లక్షల కోట్లకు సంబంధించి లెక్కలతో సహా చెప్పండి అంటూ అమిత్‌షాను ఏకి పారేశారన్నారు. చంద్రబాబు మాత్రం తనపై ఉన్న కేసులకు భయపడి ప్రశ్నించలేక పోయారని ఎద్దేవ చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ప్రత్యేక హోదాతో సమానంగా రూ.3 లక్షలా 30 వేల కోట్లు ఇస్తే.. ఆ నిధులన్నింటినీ చంద్రబాబు సర్కార్ ఎలా ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.