జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరువును మహేష్ నడిబజారుకీడ్చాడు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఏపీ విభజన నాటి నుంచి నేటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తోంది.
see also : టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి… క్రికెట్ బెట్టింగ్ లో అరెస్ట్
అయితే, ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఆ పార్టీ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నేటి నుంచి ఆందోళనలు, ధర్నా చేస్తున్నారు. ఈ ఆందోళనలో ప్రత్యేక హోదా కోసం నేను సైతం అంటూ సినీ క్రిటిక్ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అధికార పార్టీ చేతులు ముడుచుకుని ఉందన్నారు. పోరాడాల్సిన సమయంలో పోరాడకుండా.. మిత్ర ధర్మమంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా చంద్రబాబు పాట్నర్ ఒకసారి టీడీపీకి మద్దతు తెలుపు.. మరోసారి చంద్రబాబును తిడుతూ.. చంద్రబాబులానే రెండు నాల్కుల దోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నోటుకు ఓటు కేసుకు భయపడి.. పవన్ కల్యాణ్ మాత్రం ప్యాకేజీ కోసం ఆశపడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. ఇలా ప్రత్యేక హోదా ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించినందుకు.. కత్తి మహేష్‌ఫై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.