తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పరిశుభ్రత కై ఎంతో శ్రమించే పీఎచ్ వర్కర్స్ కి త్వరలో జీతాలను పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.నగర మేయర్ నన్నపునేని నరేందర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో పీఎచ్ వర్కర్స్ జీతాల పెంపు,హెల్త్ కార్డ్స్ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు..ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి వీటిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుందని.. రాష్ట్ర బడ్జెట్ కి ముందుగానే పీఎచ్ వర్కర్స్ జీతాలను పెంచుతామని తెలిపారు..కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడి జీతాలను పెంచుతున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్ కి నగర మేయర్ నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు