తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు . వరంగల్ చేరుకున్న మంత్రి కేటీ ఆర్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ ల్యాబ్ (ఇంక్యుబేషన్ సెంటర్) ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలన్నారు . ఇంక్యుబేషన్ సెంటర్ వరంగల్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశం. సామాన్యులకు ఉపయోగపడకపోతే ఎంత సాంకేతిక పరిజానమైన వృథానే అని చెప్పారు .
see also :టీఆర్ఎస్ లోకి ప్రముఖ సినీ నటుడు..?
నవీన ఆవిష్కరణలు కేవలం చదువుకున్న వారికే మాత్రం పరిమితం కాదు. రెండు వేలకు పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు స్టార్టప్‌ల నుంచే వస్తాయి. 2014కు ముందు విద్యా అభివృద్ధిపై పాలకులు దృష్టిపెట్టలేదు. డ్రోన్ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోందని కేటీఆర్ అన్నారు.సృజనాత్మకత ఉంటే ఏ రంగంలో ఉన్నవారికైనా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మేయర్ నన్నపునేని నరేందర్, కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు.
see also :సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?
see also :డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్నలీడర్ కేసీఆర్..కత్తి మహేష్
Hon'ble Dy CM @KadiyamSrihari and Minister @KTRTRS lighting the ceremonial lamp at the inaugural event of SR innovation lab @srixincubator at SR Engineering College in Warangal today. pic.twitter.com/kd2soyKrgt
— Min IT, Telangana (@MinIT_Telangana) March 5, 2018
SRiX @srixincubator is perhaps the largest incubator in a Tier 2 city in our country. I am happy to learn that SRiX will soon have a prototyping lab and a Makerspace too: @KTRTRS pic.twitter.com/VzKEoNG8UT
— Min IT, Telangana (@MinIT_Telangana) March 5, 2018