Home / EDITORIAL / కేసీఆర్ @ గ్రీన్ ఇండియా..!

కేసీఆర్ @ గ్రీన్ ఇండియా..!

భారత దేశ రాజకీయ మూస పోకడలకు భిన్నంగా ఒక అద్భుతమైన భారత్ ను నిర్మించే సంకల్పానికి తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేస్తున్నారు . ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని నవ భారత నిర్మాణానికి అవసరమైన బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ , బీజేపీ యేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యాచరణ ను ఆయన ప్రారంభించారు . సమయం దొరికినప్పుడల్లా ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తున్న కేసీఆర్ 120 కోట్ల మంది ప్రయోజనాల కోణంలో రూపొందించుకోబోతున్న ఎజెండాతో దేశంలోని పార్టీలను , ప్రజలను ఒప్పించడానికి సిద్ధమవుతున్నారు . పాత మూస రాజకీయాలకు పాతరేసి ఒక కొత్త రాజకీయ వ్యవస్థకు ప్రాణం పొసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు . పద్నాలుగేళ్ల సుదీర్ఘ , శాంతియుత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సక్సెస్ అయిన కేసీఆర్ 45 నెలల కాలంలోనే మానవీయ నిర్ణయాలు తీసుకునే ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు . తెలంగాణ ప్రజల మాదిరిగానే ఈ దేశ ప్రజలందరికీ మానవీయ పాలనను ఎందుకు అందించకూడదనే ఒక ప్రశ్నను భగవంతుడే ఆయనకు సంధించినట్లుగా అనిపిస్తున్నది . అందుకే ఆయన సరికొత్త ఎజెండాను రూపొందించుకుని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజల ముందు ఉంచి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు . దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు అవసరమైన వ్యూహరచన ప్రారంభించారు . అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రజల సంపూర్ణ అభిమానాన్ని దక్కించుకున్న కేసీఆర్ ఇదే తరహాలో జాతీయ స్థాయి ఎజెండాను అన్ని పార్టీల ముందు ఉంచే కార్యాచరణ ను ప్రారంభిస్తున్నారు .

దేశం మీద ప్రేమతోనే ప్రత్యామ్నాయం దిశగా ముందడుగు 
————————-————————-—————-

తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఋషి లాంటి మనిషి . ప్రజాసేవ అనే ఒక తపన ఆయన హృదయాంతరాల్లో ఉంది . ఆయన రాజకీయ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రజలకు మేలు చేసే విషయంలో ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించి ఒక సంకల్ప బలంతో పని చేసే విషయం అర్ధమవుతుంది . ఆయన ఎమ్మెల్యేగా పని చేసినా , రవాణా శాఖ మంత్రిగా పని చేసినా కొత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునేవారు . ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి . ఒక భారతీయుడిగా తెలంగాణ పాలనా ఒరవడిని దేశస్థాయిలో ఎందుకు విస్తరించకూడదన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చి ఉంటుంది . అద్భుతమైన సహజ సంపద , మానవ వనరులు ఉన్న దేశాన్ని ఒక కొత్త దిశలో నడిపించాలన్న సంకల్పాన్ని ఆయన తీసుకున్నట్లుగా అనిపిస్తున్నది . అందులో భాగంగానే దేశంలోని బీజేపీ , కాంగ్రెస్ యేతర రాజకీయ శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక అద్భుతమైన ఎజెండాకు రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లి ఆశీర్వాదం కోరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనపడుతున్నది .

దేశ పాలనలో విప్లవాత్మక మార్పులకు అవకాశం 
————————-————————-——

కేసీఆర్ సారథ్యంలో జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడితే పాలనా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉంది . ముఖ్యంగా దేశ బడ్జెట్ లో అధిక భాగం నిధులు సంక్షేమ , సాగు నీటి వ్యవసాయ రంగాలకు , దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు సరఫరా , పారిశ్రామిక అనుమతుల సరళీకరణ , శాంతి భద్రతలు , ఉపాధి కల్పన వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది .

అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు – సముచిత గౌరవం 
————————-————————-————-

కేసీఆర్ ప్రధాని అయితే దేశ భద్రత , సార్వ భౌమత్వం , రాజ్యాంగ పరిరక్షణ , విదేశీ వ్యవహారాలు వంటి ముఖ్యమైన అంశాలు మినహా సాధ్యమైనంతవరకు రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు కల్పించి పాలసీ నిర్ణయాల్లోనూ రాష్ట్రాలను భాగస్వాములను చేసే అవకాశం ఉంది . తాగు నీరు , విద్యుత్తు , సాగు నీరు , సంక్షేమం , పారిశ్రామిక అభివృద్ధి , శాంతి భద్రతలు వంటి పలు కీలక అంశాల్లో రాష్ట్రాలను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది .

అద్భుతంగా రామ మందిరం – బాబరీ మసీదు నిర్మాణం 
————————-————————-—————

దేశంలో పరిష్కారానికి నోచుకోని అయోధ్య అంశానికి కేసీఆర్ ప్రధాని అయితే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుక్కోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది . హిందూ , ముస్లిం వర్గాలను ఒప్పించి మెప్పించి అయోధ్యలో కానీ వారు కోరుకున్న చోట కానీ ఒక అద్భుతమైన రామ మందిరాన్ని , మరో చోట బాబరీ మసీదు నిర్మాణాన్ని చేపట్టడానికి ఏదైనా ట్రస్ట్ ఆధ్వర్యంలో చొరవ చూపే ఆస్కారం ఉంది .

లౌకిక పునాదులపై ఆధ్యాత్మిక భారత్ 
————————-——————

కేసీఆర్ సారథ్యంలో జాతీయ ప్రభుత్వం ఏర్పడితే అన్ని మతాలను గౌరవించే సర్వమత ఆధ్యాత్మిక భారత్ ను నిర్మించే దిశగా ప్రయత్నాలు జరగడానికి ఆస్కారం ఉంది . జనాభా కనుగుణంగా గంగా జమునా తెహజీబ్ సంస్కృతిని విస్తరించేలా అన్ని మతాల ప్రార్ధనా మందిరాల నిర్మాణానికి ప్రోత్సాహం అందించే అవకాశం ఉండొచ్చు . భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే కార్యాచరణ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది .

పాకిస్థాన్ సమస్యకు శాశ్వత పరిష్కారం 
————————-——————-

పాకిస్థాన్ తో కాశ్మీర్ అంశం పై శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్చలు జరిపే అవకాశం ఉంది . ఈ దేశ ముస్లిం మతపెద్దల మధ్యవర్తిత్వంతో పరిష్కార మార్గాలకు ఒక బలమైన ప్రయత్నం జరిగే వీలుంది . రెండు దేశాలు సామరస్య పూర్వకంగా ఉండడం వల్ల రక్షణ రంగానికి కొంత బడ్జెట్ కేటాయింపులు తగ్గించుకోవచ్చని దాని వల్ల ఇరు దేశాలకు మేలు జరుగుతుందని పాకిస్థాన్ ను ఒప్పించే ప్రయత్నం జరగవచ్చు .

చైనా తో వైరానికి చర్చలతో ముగింపు 
————————-—————-

కాస్త జాగ్రత్తగా ఒప్పించే ప్రయత్నం చేస్తే పరిష్కారం కాని
సమస్యలంటూ ఏమీ ఉండవు . పొరుగు దేశం చైనాతోనూ సామరస్య పూర్వక చర్చలకు ఆస్కారం ఉండొచ్చు . ఆసియా దేశాల మైత్రి వల్ల అందరికీ కలిగే ప్రయోజనాల కోణంలో ఆలోచించమని సహచర దేశాలను ఒప్పించే మంచి ముందడుగు పడవచ్చు .

నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధ్యాన్యం 
————————-————————-—-

దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడేలా నదుల అనుసంధానాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది . ఏ ఒక్క రాష్ట్రం ఆయకట్టుకీ నష్టం జరగకుండా కేంద్రం నిధులతో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది . అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ప్రయత్నం జరగవచ్చు .

దేశానికి మేలు చేసే రాజ్యాంగ సవరణలు 
————————-———————

దేశ ప్రజలకు మేలు చేసే విధాన పరమైన అంశాల్లో , రాష్ట్రాలకు వీలైనన్ని ఎక్కువ హక్కులు కల్పించే రాజ్యాంగ సవరణలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది . ఆయా రాష్ట్రాల పరిస్థితులను భట్టి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నాలు జరగడానికి ఆస్కారం ఉంది . కీలకమైన న్యాయవ్యవస్థ విస్తరణకు నిధులు కేటాయించి సామాన్యుడికి న్యాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగవచ్చు .

దేశాభివృద్ధిలో అంబానీ , టాటా ల భాగస్వామ్యం 
————————-————————-——

పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు దేశాభివృద్ధిలో అంబానీలు , టాటా ల వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలను భాగస్వాములను చేసే ప్రయత్నం జరగడానికి అవకాశం ఉంది . పారిశ్రామిక సరళీకరణ వల్ల దేశ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి .

ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆలోచనలతో కూడిన ఎజెండాను కేసీఆర్ రూపొందించి ఇతర పార్టీలను సంప్రదించే అవకాశం ఉంది . ఈ ఎజెండాను ప్రజల్లోకి కూడా విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఉండడంతో ప్రజల నుండి కూడా భారీ స్పందన వస్తుండవచ్చన్న అంచనా ఉంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat