దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన హయాంలో నేటి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, ఆ క్రమంలోనే ఈడీ, సీబీఐ శాఖలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై వందల కొంద్దీ కేసులు పెట్టాయని, ఆ కేసుల్లో వైఎస్ జగన్‌కు తడిసిపోవడం ఖాయమంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.
see also : వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?
see also : అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు
ఇప్పటికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై వందలకొద్దీ కేసులు పెట్టుకుని, ఒకసారి సోనియా గాంధీ కాళ్లు పట్టుకుంటాడు..! మరో పక్క ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంటాడు..!! తీరి ఏపీకి తిరిగొచ్చి వాళ్లపై తిరగబడతాడు.. ఇంకోసారి జైలుకు పోతే కాళ్లు కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకుంటాడు అంటూ వైఎస్ జగన్‌పై తీవ్రవిమర్శలు చేశారు. ఈ రోజు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షపార్టీ పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.