భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా అయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.దేశంలో అలాంటి ఫ్రంట్ ఏర్పాటుకు తాను వెంటే ఉండి పూర్తి సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా అజిత్ జోగి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారని సీఎం కేసీఆర్ కు అజిత్ జోగి కితాబు ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించి గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. భవిష్యత్తులో కేసీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అజిత్ జోగి విశ్వాసం వ్యక్తం చేశారు
